అమెరికాలో ఇంటి యజమాని... కేపీహెచ్బీ కాలనీలోని ఇంట్లో దొంగ పట్టివేత!

10-03-2022 Thu 09:20 | Telangana
  • గత ఏడాది అమెరికాకు వెళ్లిన కేపీహెచ్బీ నివాసి
  • ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుండగా ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు గుర్తింపు
  • వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చిన వైనం
  • దొంగను ప్రత్యక్షంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు ప్రత్యక్షంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, కాలనీలోని రోడ్ నంబర్ 2లోని ఎల్ఐజీ 237 ఫ్లాట్ లో ఒక వ్యక్తి నివసిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో ఆయన అమెరికాకు వెళ్లారు. అయితే తన ఇంటికి ఆయన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 

భారత కాలమానం ప్రకారం నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీని చూస్తుండగా ఒక వ్యక్తి గదుల్లో తిరుగుతున్నట్టు గమనించారు. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారమిచ్చారు. వెంటనే వారు అక్కడకు వెళ్లి చూడగా... ప్రధాన తాళాన్ని పగులగొట్టి, తలుపుకి లోపల గడియపెట్టినట్టు గుర్తించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న వెంటనే డీఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు 5 నిమిషాల వ్యవధిలోనే అక్కడకు చేరుకున్నారు. తలుపు తీయాలంటూ దొంగను హెచ్చరించారు. దొంగ తలుపు తీయకపోవడంతో... వారు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లారు. దొంగ పడకగది తలుపు వెనుక నక్కాడు. దీంతో, లొంగిపోవాలంటూ డీఎస్సై తుపాకీతో బెదిరించగా, అతను లొంగిపోయాడు. అప్పటికే సదరు దొంగ బీరువా, షెల్ఫ్ లు తెరిచినట్టు గుర్తించారు. తాను చోరీ చేసిన వెండి ఆభరణాలు, నగదును బూట్లలో దాచి, పలు ఆభరణాలను మంచం పరుపు కింద దాచినట్టు పోలీసులు గుర్తించారు. 

దొంగను నాగర్ కర్నూలు జిల్లా యాపర్లకు చెందిన రామకృష్ణ (32)గా గుర్తించారు. ఇతను జూబ్లీహిల్స్ లో ఒంటరిగా ఉంటున్నాడు. సినీ పరిశ్రమలో బోయ్ గా పని చేస్తున్నాడు. ఇళ్లలో చోరీలు చేస్తూ ఇప్పటికే 10 సార్లు జైలుకు వెళ్లొచ్చాడు. రామకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
KPHB ColonyThiefCaught On Camera

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more